Vizag: జగన్ పై దాడి ఫలితం... వైజాగ్ ఎయిర్ పోర్ట్ సీఎస్ఓ బదిలీ!

  • ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి
  • చెన్నైకి బదిలీ అయిన సీఎస్ఓ వేణుగోపాల్
  • వేణుగోపాల్ ను ప్రశ్నించిన ఏఏఐ

దాదాపు 10 రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం తరువాత సెక్యూరిటీ విషయంలో వైఫల్యానికి కారకుడన్న కారణాలతో విశాఖ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ)గా ఉన్న వేణుగోపాల్ ను చెన్నైకి బదిలీ చేస్తున్నట్టు ఏఏఐ (ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఈ మేరకు ఏఏఐ ఉత్తర్వులు వెలువరించింది. కాగా, గత ఐదేళ్లుగా విశాఖ ఎయిర్ పోర్టులో సీఎస్ఓ గా వేణుగోపాల్ పనిచేస్తుండగా, గతంలో రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు వచ్చి కూడా వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది.

జగన్ పై హత్యాయత్నం అనంతరం, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన ఏఏఐ అధికారులు, ఘటన తరువాత జగన్ పక్కనే ఆయన ఉండకుండా, శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని ప్రశ్నించినట్టు తెలిసింది. జగన్ రెండు నెలలుగా ఎయిర్ పోర్టుకు వస్తుండగా, మొదట్లో స్థానిక నేత జియ్యాని శ్రీధర్ ఇంట్లో నుంచి కాఫీ వచ్చేది. ఘటనకు రెండు వారాల క్రితం, సీఎస్ఓ వేణుగోపాల్, కాఫీ తెచ్చేందుకు అనుమతించలేదు. ఉద్దేశపూర్వకంగానే కాఫీని అడ్డుకున్నారా? అన్న అనుమానాలపైనా ఏఏఐ ఆయన్ను ప్రశ్నించినట్టు సమాచారం.

More Telugu News