KTR: ‘మహాకూటమి’ని గెలిపించి మన మరణశాసనం మనమే రాసుకుందామా?: మంత్రి కేటీఆర్

  • అది గెలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి
  • రిమోట్ ను చంద్రబాబు చేతుల్లో పెట్టొద్దు
  • మన జుట్టు చంద్రబాబుకు ఇవ్వొద్దు

 తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ‘మహాకూటమి’ని గెలిపించి మన మరణశాసనం మనమే రాసుకుందామా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జలగం ప్రసాదరావు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి రిమోట్ ను చంద్రబాబు చేతుల్లో పెట్టొద్దని పిలుపు నిచ్చారు. మన జుట్టు చంద్రబాబుకు ఇవ్వకూడదని, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నది ఆయనేనని అన్నారు. మహాకూటమి గెలిస్తే తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని, ప్రాజెక్టును ఆపాలని కోరుతూ కేంద్రానికి ముప్పై లేఖలు రాసిన ఘనత బాబుదని మండిపడ్డారు.

అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మంలో జలగం కుటుంబానికి ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉందని, ప్రసాదరావు శక్తి అందరికి తెలుసని కొనియాడారు. తాను జలగం ప్రసాదరావు కింద పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గతంలో తాము రాజకీయ ప్రత్యర్థులమైనప్పటికీ, ఎన్నడూ వారి కుటుంబాన్ని అగౌరవపరచలేదని అన్నారు.

More Telugu News