Jana Reddy: జానారెడ్డి సభలో కార్యకర్తల నిరసన.. ఆగ్రహించిన నేత!

  • అభ్యర్థి ఎంపిక విషయమై సమావేశం
  • రఘువీర్‌‌కి టికెట్ కేటాయిస్తానంటే ఊరుకునేది లేదు
  • స్థానికులకు టికెట్ కేటాయించాలని డిమాండ్

ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి టికెట్ కేటాయించకుండా స్థానికేతరులకు కేటాయిస్తామనడంపై కార్యకర్తలు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రతిపక్ష నేత జానారెడ్డిపై పార్టీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జానారెడ్డి ఏర్పాటు చేశారు.

పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పని చేస్తున్న వారిని కాదని స్థానికేతరులైన జానారెడ్డి తనయుడు రఘువీర్‌కో లేదంటే ఇటీవల పార్టీలో చేరిన అమరేందర్ రెడ్డికో టికెట్ కేటాయిస్తామంటే ఊరుకునేది లేదని కార్యకర్తలు స్పష్టం చేశారు. గిరిజన నేతలు స్కైలాబ్‌ నాయక్, శంకర్‌ నాయక్‌లకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. జానారెడ్డి ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు కాంగ్రెస్ ప్రచారరథం ఫ్లెక్సీలు చించివేసి తమ నిరసనను తెలియజేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో జానారెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.  
 

More Telugu News