ayodya: రామ భక్తులకు తీపికబురు...అయోధ్యలో సరయూ నది తీరాన శ్రీరాముని భారీ విగ్రహం ఏర్పాటు

  • ఎత్తు 151 మీటర్లు (495 అడుగులు)
  • ప్రతిపాదనలు తెలిపిన ఉత్తరప్రదేశ్‌ అధికారులు
  • దీపావళి రోజున వివరాలు వెల్లడించనున్న సీఎం ఆదిత్యనాథ్‌

శ్రీరాముని భక్తులకు తీపి కబురు. ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో సరయూనది తీరాన శ్రీరాముని భారీ విగ్రహం ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 151 మీటర్లు (495 అడుగులు) ఎత్తున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు ప్రకటించారు. మట్టి పరీక్షలు నిర్వహించిన అనంతరం భౌగోళికంగా విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో నిర్ణయిస్తామని వెల్లడించారు.

అయితే సంత్‌ తులసీదాస్‌ ఘాట్‌ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 7వ తేదీన దీపావళి రోజున ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్‌ వెల్లడిస్తారని అధికారులు తెలిపారు. గుజరాత్‌ రాష్ట్రంలోని నర్మదా నది తీరాన 182 మీటర్ల ఎత్తున సర్దార్‌ వల్ల‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఇటీవల మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాముడి విగ్రహం ఏర్పాటుతో మరో రికార్డు నెలకొల్పే యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్లుంది.

More Telugu News