South Korea: అవి నెహ్రూ జాకెట్లు.. మోదీ ఎప్పటికీ నెహ్రూ కాలేరు!: నెటిజన్ల కామెంట్లు

  • మూన్ జేఇన్ ట్వీట్‌పై దుమారం
  • జాకెట్లు మోదీవిగా భావించడమే కారణం
  • ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా ట్వీట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్‌కు ప్రధాని మోదీ దుస్తులు పంపడం.. వాటిని ఆయన వేసుకుని మురిసిపోవడం వరకూ బాగానే ఉంది. తన సంతోషాన్ని మూన్ జేఇన్ ట్విట్టర్‌లో పంచుకోవడం.. మోదీకి కృతజ్ఞతలు తెలపడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. మోదీ దుస్తులు పంపినందుకు కాదు ఈ రచ్చంతా.. అవి మోదీ జాకెట్లుగా ఆయన భావించడమే దీనికి కారణం. అవి నెహ్రూ జాకెట్లు అని, మోదీ జాకెట్లు కాదని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

దీనిపై జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘దక్షిణ కొరియా అధ్యక్షుడికి ప్రధాని మోదీ దుస్తులు పంపడం బాగానే ఉంది. అయితే వాటిని లేబుల్ మార్చకుండా పంపితే బాగుండేది. ఇప్పటి వరకు అవి నాకు నెహ్రూ జాకెట్లుగానే తెలుసు.. మోదీ జాకెట్లుగా పేరు మారాయని ఇప్పుడే తెలిసింది. 2014కి ముందు ఇండియాలో ఏమీ లేవు’’ అని వెటకారంగా ట్వీట్ చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు ఎందరో రాజకీయ ప్రముఖులు మూన్ జేఇన్‌ ట్వీట్‌పై స్పందించడమే కాదు. అవి నెహ్రూ జాకెట్లని.. మోదీ ఎప్పటికీ నెహ్రూ కాలేరని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.

More Telugu News