Paripurnananda: ఏమిటీ ఉన్మాదం?... అర్చకుడి హత్యపై పరిపూర్ణానంద ఆగ్రహం!

  • భక్తి గీతాలను మైక్‌లో ప్రసారం చేస్తున్నాడని దాడి
  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన అర్చకుడు
  • అంత్యక్రియలకు హాజరైన పరిపూర్ణానంద

వరంగల్‌ అర్బన్‌ జిల్లా పోచమ్మ మైదాన్‌లోని శ్రీ శివసాయి మందిరం ప్రధాన అర్చకుడు సత్యనారాయణపై అక్టోబర్‌ 26న దాడి జరిగిన విషయం తెలిసిందే. భక్తి గీతాలను మైక్‌లో ప్రసారం చేస్తున్నాడన్న కోపంతో వరంగల్, ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాధిక్‌ హుసేన్‌ ఆయనపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో అర్చకుడికి కాలేయం దెబ్బతిని తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 7 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు నేడు వరంగల్ లో జరిగాయి.

సత్యనారాయణ అంత్యక్రియలకు శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద హాజరయ్యారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. సత్యనారాయణ హత్యపై పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజలు చేస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. అర్చకులపై ఇలాంటి దాడులు జరుగుతుంటే పూజలు, పండుగలు ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. మదార్సాలలో ఇలాంటి ఉన్మాదులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం గుర్తించాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

More Telugu News