stock market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మరోసారి 35వేలను దాటిన సెన్సెక్స్

  • రూపాయి విలువ, క్రూడాయిల్ ధర ప్రభావం
  • 580 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 27 శాతానికి పైగా లాభపడ్డ పీసీ జువెలర్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. అమెరికన్ డాలరులో రూపాయి మారకం విలువ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గడం, విదేశీ పెట్టుబడులు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 580 పాయింట్లు లాభపడి 35,012కు పెరిగింది. నిఫ్టీ 173 పాయింట్లు పుంజుకుని 10,553కు చేరుకుంది.

టాప్ గెయినర్స్:
పీసీ జువెలర్స్ (27.10%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (14.16%), గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (12.35%), వెంకీస్ (11.78%), బీఈఎంఎల్ (8.69%).

టాప్ లూజర్స్:
ఐఐఎఫ్ఎల్ (-7.03%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-7.00%), అర్వింద్ లిమిటెడ్ (-5.38%), వక్రాంగీ (-4.86%), టోరెంట్ ఫార్మా (-4.74%).      

More Telugu News