Kodandaram: రాహుల్ గాంధీతో భేటీ అయిన కోదండరామ్

  • కోదండరామ్ ను ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్
  • సీట్ల కేటాయింపు, ఎన్నికల వ్యూహంపై చర్చ
  • 15 సీట్లు కోరుతున్న కోదండరామ్
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లి, ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీట్ల కేటాయింపులతో పాటు, ఎన్నికల ప్రచార వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణలోని 119 స్థానాల్లో కాంగ్రెస్ 95, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేస్తాయని ఢిల్లీలో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టీజేఎస్, సీపీఐలకు మిగిలిన 10 స్థానాలు కేటాయిస్తామని చెప్పారు. తమకు 15 సీట్లు ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కోదండరామ్ తో రాహుల్ చర్చలు జరుపుతున్నారు. 
Kodandaram
Rahul Gandhi
congress
tjs

More Telugu News