Vijay Sai Reddy: అప్పుడు రాహుల్‌ కారుపై కోడి గుడ్లు విసిరారు.. ఇప్పుడు శాలువా కప్పి కాళ్లు పట్టుకున్నాడు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • టీడీపీ, కాంగ్రెస్ ల కలయికపై విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు
  • గుంటూరు సభలో రాహుల్‌కు బాబు వార్నింగ్‌ ఇచ్చారు  
  • ఇపుడు ఎవరి శరణు కోసం పొర్లు దండాలు పెడుతున్నారు
టీడీపీ, కాంగ్రెస్ ల కలయికపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ ని భూస్థాపితం చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఎవరి శరణు కోసం పొర్లు దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.

‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఆ పార్టీ వెంటిలేటర్‌పై ఉంది. అది తీసేస్తే చచ్చినట్లే. ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు విశ్రమించేది లేదు’.. ఏడాది క్రితం వరకు ప్రతి వేదికపైన బాబు చెప్పిన భారీ డైలాగులు. ఇప్పుడు.. శరణు కోరుతూ కాంగ్రెస్‌కు పొర్లు దండాలు. ఆహా! ఏం వీరత్వం, శూరత్వం?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏడాది క్రితం గుంటూరులో సభ పెడితే రాహుల్‌కు బాబు వార్నింగ్‌ ఇచ్చాడు. తెలుగు జాతికి క్షమాపణలు చెప్పిన తర్వాతే సభ జరగాలన్నారు. పచ్చ చొక్కాల చేత నల్ల జెండాలతో నిరసన చేయించారు. రాహుల్‌ కారుపై కోడి గుడ్లు విసిరారు. ఇప్పుడు, అదే రాహుల్‌కు బాబు శాలువా కప్పి కాళ్లు పట్టుకున్నాడు' అంటూ వరుస ట్వీట్లు సంధించారు.
Vijay Sai Reddy
Chandrababu
YSRCP
Telugudesam
Andhra Pradesh
Congress

More Telugu News