telangana DGP: డీజీపీగారూ...యువతులు మమ్మల్ని వేధిస్తే ఎవరికి చెప్పుకోవాలి?: ట్విట్టర్‌లో మహేందర్‌రెడ్డికి యువకుడి ప్రశ్న

  • మగాళ్లూ ఫిర్యాదు చేయొచ్చని సమాధానమిచ్చిన పోలీస్‌ బాస్‌
  • హెల్ప్‌లైన్‌ లేదా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ను సంపద్రించాలని సూచన
  • మీటూ ఉద్యమం నేపథ్యంలో హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంచిన తెలంగాణ పోలీసులు

‘మహిళలను వేధించే వారిపై చర్యలు తీసుకుంటామని, వారి భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు, సంతోషం. కానీ మగాళ్లను వేధిస్తున్న యువతుల సంగతేమిటి డీజీపీగారు?’ అంటూ ఓ యువకుడు  తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ బాస్‌ మహేందర్‌రెడ్డిని ట్విట్టర్‌లో ప్రశ్నించాడు.

‘మహిళల భద్రత పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లాల వారీగా హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉంచాం. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన వారు ఈ నంబర్లకు ఫిర్యాదు చేయొచ్చు’ అంటూ డీజీపీ ట్విట్టర్‌లో చేసిన సూచనపై ఈ యువకుడు ఇలా ట్వీట్‌ చేశాడు. దీనిపై డీజీపీ స్పందిస్తూ మగవాళ్లు కూడా వేధింపులకు గురయితే నిరభ్యంతరంగా హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని, లేదా దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేశారు.

More Telugu News