Prostitute: ఇష్టం లేకుంటే వ్యభిచారిణి అయినా అత్యాచారమే: సుప్రీం సంచలన తీర్పు!

  • 1997లో నమోదైన కేసులో తుది తీర్పు
  • నలుగురు సామూహిక అత్యాచారం చేశారన్న వేశ్య
  • వారు రేప్ చేసినట్టేనన్న అత్యున్నత ధర్మాసనం

ఓ మహిళ వ్యభిచారిణే అయినా, ఆమెకు ఇష్టం లేకుండా చేసే సంభోగం అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వ్యభిచారిణులు అయినా విటులను తిరస్కరించవచ్చని, ఆమె అంగీకరించకుండా కలిస్తే, రేప్ చేసినట్టేనని పేర్కొంది.

1997లో నమోదైన ఓ కేసు విచారణలో తుది తీర్పును ఇచ్చింది. అప్పట్లో తనపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారని ఓ వ్యభిచారిణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో కింది కోర్టులు ఆమె పెట్టిన కేసు కొట్టివేయగా, సుప్రీంకోర్టు విచారించింది. లైంగిక కోరికను తీర్చుకునేందుకు యువతి అంగీకారం తప్పనిసరని, ఆమె అంగీకరించకుంటే, అది అత్యాచారమేనని స్పష్టం చేసింది.

More Telugu News