చంద్రబాబు పిలుపులో నిజం ఉంది: అరుణ్ శౌరీ
- చంద్రబాబు-రాహుల్ కలవడం శుభపరిణామం
- చంద్రబాబు కీలక పాత్ర పోషించాలి
- మోదీకి నిద్ర పట్టకపోవచ్చు
దేశంలోని రాజకీయ నాయకులందరితోనూ చంద్రబాబుకు మంచి సంబంధాలున్నాయని, అద్భుతమైన పాలనా దక్షత ఆయన సొంతమని కితాబిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్య భూమిక పోషిస్తే ఫలితాలు వేరుగా ఉంటాయన్నారు. ఆయనకు విజయం చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబుతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ చేతులు కలపడం చూసి మోదీకి నిద్రపట్టకపోవచ్చన్నారు. మోదీ పాలన వల్ల దేశం ఎంత ప్రమాదకరంగా తయారైందో తెలుసుకునే వారు శత్రుత్వాన్ని వీడి చేతులు కలిపారని అరుణ్ శౌరీ పేర్కొన్నారు. ఇదో మంచి పరిణామమని అన్నారు.