చంద్రబాబుకు ప్రధాని పదవి మీద ఆశ లేదు.. ఏపీ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం!: మంత్రి అచ్చెన్నాయుడు
- హోదా ఇస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారు
- బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్ తో కలుస్తున్నాం
- ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని పదవిని ఆశించడం లేదనీ, రాష్ట్ర ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాతో పాటు విభజనహామీలు అమలు చేస్తామని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. ఏపీ ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారనీ, హోదా వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.