rahuldravid: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం

  • ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దక్కిన చోటు
  • ఈ గౌరవం దక్కిన 5వ భారత క్రికెటర్
  • జ్ఞాపిక అందజేసిన సునీల్ గవాస్కర్

‘మిస్టర్ డిపెండబుల్’, ‘ది వాల్’గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్రవేసిన భారత మాజీ క్రికెటర్, దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు చోటు దక్కింది. గురువారం తిరువనంతపురం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రవిడ్ ఈ జ్ఞాపికను అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి భారత మాజీ స్పిన్ బౌలర్ కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

భారత్ తరపున 164 టెస్టులు, 344 వన్డే మ్యాచ్‌లు ఆడి రెండు ఫార్మాట్లలోనూ 10 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రాహుల్ ద్రావిడ్.. భారత్ తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదవ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ద్రవిడ్‌కు ముందు 2009లో గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, 2015లో అనిల్ కుంబ్లేలు ఈ గౌరవాన్ని పొందారు. 

More Telugu News