పీఓకే గుండా పాక్-చైనా బస్సు సర్వీసు.. భారత్ ఆగ్రహం!
- లాహోర్ నుంచి చైనాలోని కషగర్ వరకు బస్సు సర్వీసులు
- ఈ నెల 13 నుంచి సర్వీసులు ప్రారంభం
- మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనన్న భారత్
ఈ నేపథ్యంలో, ఈ సర్వీసులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీవోకే గుండా బస్సు సర్వీసులను నడపం తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమవుతుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ తెలిపారు. 1963లో చైనా-పాకిస్థాన్ లు చేసుకున్న సరిహద్దు ఒప్పందం అక్రమమైనదని... భారత్ దాన్ని ఎన్నడూ గుర్తించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో పీవోకే గుండా ఎలాంటి బస్సు సర్వీసులను నడిపినా అది నిబంధనల ఉల్లంఘనే అవుతుందని అన్నారు.