shakila: విచిత్రం .. 'షకీలా' బయోపిక్ లో ఆమెదే అతిథి పాత్ర!

  • తెరపైకి 'షకీలా' బయోపిక్ 
  • ప్రధాన పాత్రలో 'రిచా చద్దా'
  • దర్శకుడిగా ఇంద్రజిత్ లంకేశ్  

మలయాళంలో శృంగార తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా, ఆ తరువాత తమిళ .. తెలుగు భాషల్లోను అదే స్థాయి గుర్తింపును తెచ్చుకుంది. వయసుతో పాటు అవకాశాలు కూడా తగ్గుతూ రావడంతో, చిన్న చిన్న వేషాలు కూడా వేస్తూ వెళుతోంది. అలాంటి షకీలా బయోపిక్ ను మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో షకీలా పాత్రలో 'రిచా చద్దా' నటిస్తుండగా, షకీలా మాత్రం అతిథి పాత్రలో కనిపించనుందట. నెల్లూరు జిల్లాకి చెందిన షకీలా సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? శృంగారతారగానే కొనసాగడానికి కారణాలు ఏమిటి? ఆమె జీవితం ఎలాంటి అనూహ్యమైన మలుపులు తిరిగింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ బయోపిక్ వుంటుందట. షకీలాను ఎవరెవరు మోసం చేశారనేది కూడా చూపిస్తారనే టాక్ బయటికి రావడంతో, కొంతమందికి టెన్షన్ పట్టుకుందని చెప్పుకుంటున్నారు.    

More Telugu News