పెట్రోలు, డీజిల్ ధరల్లో తగ్గుదల!

  • వరుసగా 15వ రోజూ తగ్గిన ధరలు
  • పెట్రోలు, డీజిల్ పై 18 పైసల తగ్గుదల
  • వెల్లడించిన ప్రభుత్వ రంగ ఐఓసీ
వరుసగా 15వ రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ఒపెక్ దేశాల నుంచి పెరుగుతున్న ఉత్పత్తితో క్రూడాయిల్ ధరలు తగ్గుతూ ఉండటంతో ఆ ప్రభావం భారత చమురు కంపెనీలపైనా కనిపిస్తోంది. డాలర్ తో మారకపు విలువలో రూపాయి బలపడటం కూడా 'పెట్రో' ఉత్పత్తుల ధరలు దిగివచ్చేందుకు కారణమవుతోంది. ఇక గురువారం నాడు లీటరు పెట్రోలు, డీజిల్ పై 18 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీ వెల్లడించింది. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 79.37కు, డీజిల్ ధర రూ. 73.78కి చేరగా, ముంబైలో పెట్రోలు ధర రూ. 84.86, డీజిల్ ధర రూ. 77.32కు తగ్గింది.
Go Back to Shorts
Petrol
Diesel
Price Slash

More Telugu News