అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ‘తెలంగాణ’ను అణచివేసేందుకు మళ్లీ కుట్రలు: మంత్రి జూపల్లి ఫైర్

  • మహాకూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
  • ప్రజలు టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి
  • రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేసేందుకు మళ్లీ కుట్రలు జరుగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా కదిరేపాడ్ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, సమైక్య పాలనలో అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడ్డ మహాకూటమి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల హయాంలో జరిగిన అభివృద్ధిని, ఈ నాలుగేళ్లలో టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూసుకోవాలని సూచించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి చేయని వారికి ఇప్పుడు అధికారమిస్తే అభివృద్ధి చేస్తారట అంటూ కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలు చేశారు. ప్రజలు టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Telangana
jupalli krishnarao
TRS

More Telugu News