విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు.. 21 ఏళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు!
- తమిళనాడులోని ధర్మపురిలో ఘటన
- ప్రభుత్వ పాఠశాలలో బాలికపై దారుణం
- జైలుశిక్షపై బాధిత కుటుంబం హర్షం
ధర్మపురి జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సెంథిల్ కుమార్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2016లో ఓ విద్యార్థినిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సెంథిల్ కుమార్ ను రిమాండ్ కు తరలించారు.
అయితే ఈ కేసులో విచారణ చేపట్టిన జిల్లా మహిళా న్యాయస్థానం తాజాగా సెంథిల్ ను దోషిగా తేల్చింది. అతనికి 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సెంథిల్ కుమార్ కు జైలుశిక్ష విధించడంపై బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.