paruchuri: చనిపోయాడనుకున్న బసిరెడ్డి బతికుండటమే గొప్ప ట్విస్ట్: పరుచూరి గోపాలకృష్ణ

  • యుద్ధం తరువాత శాంతే మిగులుతుంది 
  • అదే 'అరవింద'లో చూపించిన నీతి 
  • బసిరెడ్డి బతికే ఉండటం గొప్ప ట్విస్ట్    

'అరవింద సమేత' సినిమా చూస్తుంటే నాకు 'యుద్ధ పర్వం' తరువాత 'శాంతి పర్వం' గుర్తొచ్చింది. యుద్ధం తరువాత శాంతే మిగులుతుంది .. అదే ఈ కథ నీతి. అలా చంపుకోకుండా శాంతిని సాధించాలంటే వెంటనే సినిమా అయిపోతుంది. అందుకే కథలో రెండు అద్భుతమైన ట్విస్టులు ఇచ్చాడు. బసిరెడ్డి బతికే ఉన్నాడనే విషయంతో ఇంటర్వెల్ కావడమనేది ఈ సినిమాకి బలంగా కనిపించే పాయింట్.

 ఎవరిని చంపానని హీరో అనుకుంటున్నాడో అతను చావలేదు. ఏ యుద్ధాన్ని ఆపుదామని హీరో అనుకున్నాడో ఆ యుద్ధం ఆగలేదు. బసిరెడ్డి ప్లాన్ ఏమిటో తెలుసుకున్న హీరో ఇప్పుడు ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అనే ఆలోచనలో పడతాడు. ఇక హీరోయిన్ ను బసిరెడ్డి ఇంట్లోకి పంపించడం మరో ట్విస్ట్. కథ పడిపోతుందేమోనని అనుకున్న ప్రతిసారి, త్రివిక్రమ్ ఆ కథను పైకి లేపిన తీరు అద్భుతంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.      

More Telugu News