ganguly: భారత క్రికెట్ ప్రమాదంలో ఉంది: సౌరవ్ గంగూలీ

  • జోహ్రీపై వచ్చిన లైంగిక ఆరోపణల్లో ఎంత నిజం ఉందో నాకు తెలియదు
  • దీనిపై స్పందించేందుకు బోర్డు ఎందుకు తాత్సారం చేస్తోంది?
  • పాలకమండలి సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి

భారత క్రికెట్ ప్రస్తుతం ప్రమాదంలో ఉందని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం ఆందోళనకరమని, వాటిపై ఆలస్యంగా స్పందిస్తుండటం గందరగోళానికి కారణమవుతోందని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పాలకమండలికి ఒక లేఖ రాశాడు.

బీసీసీఐ సీఈవో జోహ్రీపై వచ్చిన లైంగిక ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తనకు తెలియదని... కానీ, ఈ అంశంపై స్పందించేందుకు బోర్డు ఎందుకు తాత్సారం చేస్తోందని గంగూలీ ప్రశ్నించాడు. పాలకమండలి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాడు. తాము ఎటువైపు మొగ్గాలంటూ బోర్డులోని తన సన్నిహితులు తనను అడిగారని... వారికి ఏం చెప్పాలో కూడా తనకు అర్థం కాలేదని అన్నారు. భారత క్రికెట్ కు ఎన్నో ఏళ్ల పాటు తాను సేవలు అందించానని... బోర్డులో నెలకొన్న పరిస్థితులు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాడు. ప్రస్తుత పరిణామాలపై క్రికెట్ అభిమానులు కూడా కలత చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

More Telugu News