Dancing Uncle: ‘డ్యాన్సింగ్ అంకుల్‌’పై దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం.. ఓటు హక్కు వినియోగంపై వీడియోలు

  • డ్యాన్సింగ్ అంకుల్‌తో వీడియో రూపొందించిన ఎన్నికల అధికారులు
  • పలు జిల్లాల నుంచి పిలుపు
  • ఓటు హక్కుపై అవగాహన వీడియోల రూపకల్పన

డ్యాన్సింగ్ అంకుల్‌‌గా దేశవ్యాప్తంగా చిరపరిచితుడైన సంజీవ్ శ్రీవాస్తవ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భోపాల్‌లోని బాబా ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన వృత్తితో కంటే డ్యాన్స్‌తోనే ఎక్కువ పేరు సంపాదించారు. బావమరిది పెళ్లిలో చేసిన డ్యాన్స్ ఆయనకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఆ డ్యాన్స్ వీడియోతో ఆయన పేరు మార్మోగింది. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు.

సంజీవ్ శ్రీవాస్తవపై ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయనను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా శ్రీవాస్తవతో కలిసి ఓ ప్రచార వీడియోను రూపొందించారు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆ వీడియో ద్వారా ఆయన ఓటర్లకు పిలుపునిస్తున్నారు. విషయం తెలిసిన విదిశా జిల్లా అధికారులు కూడా ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.

More Telugu News