Tamilnadu: తమిళనాడు ఎక్స్ ప్రెస్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్.. గుంటూరులో తనిఖీలు!

  • చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న రైలు
  • బాంబు ఉందంటూ ఆగంతకుల ఫోన్ కాల్
  • అప్రమత్తమై తనిఖీలు చేపట్టిన అధికారులు
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న ‘తమిళనాడు ఎక్స్ ప్రెస్’లో ఈరోజు బాంబు కలకలం చెలరేగింది. ఈ రైలులో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ పోలీసులు రైలును గుంటూరు జిల్లా లోని తాడేపల్లి మండలం కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద నిలిపివేశారు. అనంతరం 200 మంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీఎఫ్ పోలీసులు అణువణువునా తనిఖీలు చేపట్టారు.

దాదాపు రెండు గంటల పాటు ఈ తనిఖీలు సాగాయి. చివరికి రైలులో ఎలాంటి బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైలు ఢిల్లీకి బయలుదేరింది.
Tamilnadu
express
bomb
phone call
Police
checking
Guntur District
Andhra Pradesh
railway

More Telugu News