Jagan: జగన్ గాయంపై విశాఖ వైద్యులు చెప్పిన దానిని ధ్రువీకరించిన హైదరాబాద్ వైద్యులు

  •  గాయంలో ఎలాంటి విషపదార్థాలు లేవన్న సిటీ న్యూరో సెంటర్
  • గాయం మానేందుకు మరో ఆరు వారాలు
  • జగన్‌ను పరీక్షించిన డాక్టర్ శివారెడ్డి బృందం
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో అయిన గాయం చిన్నదేనని హైదరాబాద్ వైద్యులు స్పష్టం చేశారు. విశాఖపట్టణం వైద్యులు చెప్పిన విషయాన్నే ధ్రువీకరించిన సిటీ న్యూరో సెంటర్ రాతపూర్వకంగా ఈ విషయాన్ని పేర్కొంది. గాయం తీవ్రమైనది (గ్రీవియస్) కాదని పేర్కొంది. ఈ మేరకు డాక్టర్ డీఎస్ శివారెడ్డి పేర్కొన్నారు. అలాగే, గాయంలో ఎలాంటి విషపదార్థాలు లేవని పేర్కొన్నారు.

జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం డాక్టర్ శివారెడ్డి బృందం పరీక్షించింది. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్భంగా డాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ.. గాయం చిన్నదేనని, అయితే, పూర్తిగా తగ్గేందుకు మరో ఆరు వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. కొన్ని జాగ్రత్తలతో జగన్ పాదయాత్రలో పాల్గొనవచ్చని తెలిపారు.
Jagan
Hyderabad
Kinife attack
city neuro centre
Andhra Pradesh

More Telugu News