MS Dhoni: దటీజ్ ధోనీ.. 0.08 సెకన్లలోనే స్టంప్స్ పడగొట్టిన మాజీ సారథి

  • వయసు మీదపడుతున్నా తగ్గని స్పీడు
  • కన్నుమూసి తెరిచేంతలో స్టంప్
  • ప్రశంసలు కురిపిస్తున్న క్రికెట్ ప్రపంచం

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అపార అనుభవంతో భారత్‌కు ఎన్నో విజయాలు ఒంటిచేత్తో అందించిపెట్టాడు. వన్డే, టీ20లు ప్రపంచకప్‌లు దేశానికి అందించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టుకు విలువైన సలహాలు అందిస్తూ ముందుకు సాగతున్నాడు. వయసు మీద పడుతున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోమారు నిరూపించాడు.

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో విండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవీంద్ర జడేజా వేసిన బంతిని విండీస్ బ్యాట్స్‌మన్ కీమో పాల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే, బంతి బ్యాట్‌కు చిక్కకుండా కీపర్ ధోనీ చేతుల్లో పడింది. ఆ వెంటనే మెరుపు వేగంతో స్పందించిన ధోనీ 0.08 సెకన్లలోనే వికెట్లను గిరాటేశాడు.

ఇది చూసిన క్రికెట్ ప్రపంచం విస్తుపోయింది. ధోనీ వేగానికి మైదానంలోని ప్రేక్షకుల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంత వేగంగా స్పందించడం ఒక్క ధోనీకే సాధ్యమని కొనియాడుతున్నారు. కాగా, వన్డే క్రికెట్ చరిత్రలో 115 స్టంపింగులు చేసిన తొలి కీపర్‌గా ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

More Telugu News