raviteja: అదరగొట్టేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' టీజర్

  • మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజ
  • బొద్దుగా మారిన ఇలియానా 
  • నవంబర్ 16వ తేదీన విడుదల

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోని' .. నవంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్ తో రవితేజను చూపుతూ టీజర్ ను కట్ చేశారు. విదేశాల్లోని లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

"మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం' అని రవితేజ చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్ ను వదిలారు. ఇలియానా కాస్త బొద్దుగా కనిపిస్తోంది .. మూడు లుక్స్ లోను రవితేజ బాగానే వున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా హిట్ కొట్టడం ఇటు శ్రీను వైట్లకి .. అటు రవితేజకి కూడా చాలా అవసరం.

More Telugu News