చెలరేగిన రోహిత్ శర్మ.. వన్డేల్లో 21వ సెంచరీ నమోదు.. రాయుడు హాఫ్ సెంచరీ

ముంబైలో వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి సత్తా చాటి వన్డేల్లో 21వ సెంచరీని నమోదు చేశాడు. 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకాన్ని బాదాడు. అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు రోహిత్, ధావన్ లు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 38 పరుగుల వ్యక్తి గత స్కోరు (40 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వద్ద పాల్ బౌలింగ్ లో కీరన్ పావెల్ కు క్యాచ్ ఇచ్చి ధావన్ పెవిలియన్ చేరాడు.

అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ సిరీస్ లో వరుసగా మూడు సెంచరీలు చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో నిరాశ పరిచాడు. 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసిన కోహ్లీ... రోచ్ బౌలింగ్ లో హోప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు ధాటిగా ఆడుతూ అర్ధశతకాన్ని (51 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) సాధించాడు.  ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు. రోహిత్ 110 పరుగులు, రాయుడు 50 పరుగులతో ఆడుతున్నారు. 
Go Back to Shorts
team india
west indies
4th one day
Rohit Sharma
ambati rayudu

More Telugu News