YSRCP: అప్పుడలా...ఇప్పుడిలానా? : వైసీపీపై ఎంపీ కనకమేడల ఫైర్‌

  • అప్పుడు సీబీఐ దర్యాప్తు చేస్తే తప్పుపట్టి ఇప్పుడెలా కోరుతున్నారు
  • ఎక్కడేం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యతా
  • ఆ పార్టీ నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలి
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపై ఫైర్‌ అయ్యారు. జగన్‌ అవినీతి కేసుపై ఒకప్పుడు సీబీఐ దర్యాప్తుచేస్తే  కక్షపూరితమని గగ్గోలు పెట్టిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తమ పార్టీ అధినేతపై జరిగిన దాడిపై అదే సీబీఐతో విచారణ కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కేసును విచారిస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ ఎలా చేయమంటారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండి పోలీసులపై నమ్మకం లేదడం వైసీపీ నేతలకే చెల్లించదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆపాదించడం, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
YSRCP
Telugudesam
kanakameda ravindra fire

More Telugu News