జగన్ ను చంపేయాలనే దాడి చేశాడు.. అప్రమత్తంగా ఉండటంతో త్రుటిలో తప్పించుకున్నారు!: ఏపీ పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడి
- జగన్ మెడపై పోటు వేయాలనుకున్నాడు
- పక్కకు జరగడంతో జగన్ కు ప్రమాదం తప్పింది
- దాడికి రెండు కత్తులను తెచ్చుకున్నాడు
వైసీపీ అధినేతపై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావును ఈరోజు న్యాయస్థానం వచ్చే నెల 2 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు రాసిన లేఖతో పాటు అతనికి లేఖ రాయడంలో సాయం చేసిన ఇద్దరిని పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా విచారిస్తున్నారు. గత గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ ను సెల్ఫీ పేరుతో సమీపించిన శ్రీనివాసరావు కోడి పందేల కత్తితో మెడపై పోటు వేసేందుకు యత్నించాడు.