నన్ను అరెస్టు చేయడం ఏమిటి?... నేను మచిలీపట్నంలో ఉన్నాను!: యాంకర్‌ రవి

28-10-2018 Sun 13:07
  • పోలీసులు విచారిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదు
  • జెమినీ టీవీ దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటున్నాను
  • వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చిన రవి
‘నన్ను అరెస్టు చేయడం ఏమిటి?... పోలీసులు విచారించడం ఏమిటి? ప్రస్తుతం నేను మచిలీపట్నంలో ఉన్నాను. జెమీటీ టీవీ చేపడుతున్న దీపావళి ఉత్సవ కార్యక్రమాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాను’ అంటూ నటుడు, ప్రముఖ యాంకర్‌ రవి క్లారిటీ ఇచ్చారు.

ఓ సినీ డిస్ట్రిబ్యూటర్‌ను బెదిరించాడన్న ఆరోపణల నేపథ్యంలో రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారన్న వార్తలు ఉదయం నుంచి షికారు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రవి తాను ఎక్కడ ఉన్నదీ, ఏం చేస్తున్నదీ తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.