Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రెండు విభిన్న పాత్రల్లో సమంత
  • పందిపిల్లకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ 
  • రాజశేఖర్ సినిమాలో కన్నడ నటి

*  అందాల సమంత త్వరలో విభిన్నమైన రెండు పాత్రలను పోషించనుంది. నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఈ చిన్నది డబ్బై ఏళ్ల వృద్ధురాలిగాను.. ఇరవై ఏళ్ల యువతిగాను ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  పందిపిల్ల ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు రవిబాబు దర్శకత్వంలో రూపొందిన 'అదుగో' చిత్రం దీపావళికి విడుదల అవడానికి రెడీ అవుతోంది. కాగా, ఈ చిత్రంలో పందిపిల్ల (బంటీ)కు ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పారట.
*  డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 'కల్కి' చిత్రంలో ప్రముఖ కన్నడ నటి నందిత శ్వేత కీలక పాత్ర పోషించనుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇది యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.

More Telugu News