modi: మోదీ హామీలను మరిచారన్న చంద్రబాబు తన హామీలను నిలబెట్టుకున్నారా?: వైసీపీ నేత మేకపాటి

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను మోదీ మరిచారని చెబుతున్న చంద్రబాబు.. మరి, తన హామీలను నిలబెట్టుకున్నారా? చంద్రబాబు తన వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు గావుకేకలేస్తున్నారని, విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్లుగా నిమ్మకునీరెత్తినట్టు ఉన్న చంద్రబాబు, ఇప్పుడు ‘ధర్మపోరాట దీక్ష’ అంటూ పోరాడుతున్నారని మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది తానే అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని అన్నారు. జగన్ పై జరిగిన దాడికి ఎవరు కారణం? జగనే తనపై ఈ దాడి చేయించుకున్నారనా? జగనే ఆ నాటకమాడారనా, చంద్రబాబు ఉద్దేశ్యం? ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.

జగన్ పై దాడి చేసిన వ్యక్తిని ఎవరో ప్రోత్సహించారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ పై జరిగిన దాడిని చిన్న విషయంగా చెప్పాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ కు ఎవరి ప్రోద్బలమో ఉందని అన్నారు. ఈ దాడికి బాధ్యులెవరో తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మేకపాటి డిమాండ్ చేశారు.
Go Back to Shorts
modi
Chandrababu
YSRCP
mekapati

More Telugu News