Bollywood: హీరోలు అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్ ల ముందే నన్ను లైంగికంగా వేధించారు!: మహిళా జూనియర్ ఆర్టిస్ట్

  • హౌస్ ఫుల్-4 షూటింగ్ సందర్భంగా ఘటన
  • లైంగికంగా వేధించారన్న జూనియర్ ఆర్టిస్టు
  • అలాంటిదేమీ లేదంటున్న చిత్ర యూనిట్
దేశంలో సినీ, రాజకీయ, మీడియా రంగాల్లో లైంగిక వేధింపులపై ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని దెబ్బకు సీనియర్ జర్నలిస్ట్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పదవి ఊడగా, బాలీవుడ్ లో హౌస్ ఫుల్-4 ప్రాజెక్టు నుంచి దర్శకుడు సాజిద్ ఖాన్ తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా హౌస్ ఫుల్-4 సినిమా షూటింగ్ సందర్భంగా కొందరు తనను లైంగికంగా వేధించారని ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించింది. హీరో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ ముఖ్ సెట్లో ఉండగానే ఈ వేధింపులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

ఈ నేపథ్యంలో సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయమై స్పందించారు. ఆరోపణలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ స్నేహితుడికి, డ్యాన్స్ మాస్టర్ కు తొలుత గొడవ జరిగిందని తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో అక్షయ్ కుమార్, రితీశ్ లు అక్కడ లేరని స్పష్టం చేశారు. మహిళా ఆర్టిస్టు స్నేహితుడికి, తమ సినిమా యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. బయట వ్యక్తులతో జరిగిన గొడవలను సినిమా యూనిట్ కు ఆపాదించడం సరికాదన్నారు. మహిళా జూనియర్ ఆర్టిస్టును ఎవ్వరూ లైంగికంగా వేధించలేదని స్పష్టం చేశారు.
Bollywood
sexual harrasment
Casting Couch
akshay kumar
housefull-4
ritesh deshmukh

More Telugu News