Twitter: జగన్ ఎన్ని చెప్పినా నిజం మారదు: నారా లోకేశ్

  • ఎన్ని కోడి కత్తి డ్రామాలు ఆడినా నిజమిదే
  • దొంగ పేపర్, చానల్ లో డబ్బా కొట్టుకుంటున్నారు
  • కుట్రలను బయటపెడితే, పోలీసులకు బెదిరింపులా?
  • ట్విట్టర్ లో నారా లోకేశ్ వ్యాఖ్యలు
తనపై హత్యాయత్నం జరిగిందని జగన్ ఎన్ని కోడి కత్తి డ్రామాలు ఆడినా దాని వెనకున్న నిజం మాత్రం మారదని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. "అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఏ1 ముద్దాయి జగన్ మోడీ రెడ్డి... దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్ లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు" అని ఆయన అన్నారు.

ఆపై "కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా... అని పోలీసులకు బెదిరింపులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు అంటూ రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా జగన్ మోడీ రెడ్డి మాట్లాడటం దారుణం" అని విమర్శించారు.
Twitter
Nara Lokesh
Jagan

More Telugu News