Pakistan: ప్రపంచానికి పెనుముప్పు పాకిస్థాన్ తోనే!: ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నివేదిక

  • సిరియాతో పోలిస్తే, పాక్ ఉగ్రవాదుల నుంచి మూడు రెట్ల అధికముప్పు
  • "హ్యుమానిటీ ఎట్ రిస్క్ - గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇన్డిసెంట్" పేరిట రిపోర్టు
  • కీలక వ్యాఖ్యలు చేసిన ఆక్స్ ఫర్డ్ 

ప్రపంచ శాంతికి పాకిస్థాన్ నుంచి విఘాతం ఉందని, సిరియాతో పోలిస్తే, పాక్ ఉగ్రవాదుల నుంచి మూడు రెట్ల అధికముప్పు ఉందని ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ కీలక నివేదిక పేర్కొంది. స్ట్రాటజిక్ ఫోర్ సైట్ గ్రూప్ (ఎస్ఎఫ్జి)తో కలసి ఈ నివేదికను తయారు చేసిన ఆక్స్ ఫర్డ్, మానవత్వానికి సిరియా జరిపిన నష్టం కన్నా, పాక్ నుంచే నష్ట తీవ్రత అధికంగా ఉండబోతున్నదని హెచ్చరించింది.

"హ్యుమానిటీ ఎట్ రిస్క్ - గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇన్డిసెంట్" పేరిట ఈ రిపోర్టు విడుదల కాగా, పాకిస్థాన్ లో ఉగ్ర శిబిరాలు, లష్కరే తోయిబా వంటి సంస్థల కార్యకలాపాలను ప్రస్తావించింది. మోస్ట్ టెర్రరిస్టు గ్రూపుల్లో పాక్ ఉగ్ర సంస్థలు ఉన్నాయని తెలిపింది. ఆఫ్గనిస్థాన్ లోని ఉగ్రవాదులకన్నా పాక్ ఉగ్రవాదులు మరింత ప్రమాదకరంగా మారారని తెలిపింది.

More Telugu News