Chandrababu: మోదీ లాంటి కనికరం లేని ప్రధానిని ఇంతవరకూ చూడలేదు!: సీఎం చంద్రబాబు

  • శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాలని కోరాను
  • రూ.3,673 కోట్ల నష్టం వాటిల్లింది
  • రెండు సార్లు లేఖరాసినా మోదీ స్పందించలేదు

కేంద్ర ప్రభుత్వం తిత్లీ తుపాను బాధితులను పట్టించుకోకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మానవతా దృక్పథంతో శ్రీకాకుళం జిల్లా వాసులను ఆదుకోవాలని కోరారు. తుపాను బీభత్సంతో రూ.3,673 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి ఉండవల్లిలో నివేదికను సీఎం సమర్పించారు.

తిత్లీ తుపాను విషయంపై రెండు సార్లు లేఖ రాసినా కేంద్రం స్పందించలేదని చంద్రబాబు తెలిపారు. ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్న ప్రధానిని తానెన్నడూ చూడలేదని విమర్శించారు. బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి రాష్ట్రానికి వచ్చిన హోంమంత్రికి తిత్లీ బాధితులను పరామర్శించే తీరిక లేదని వ్యాఖ్యానించారు.

తమ అప్రమత్తత కారణంగానే తిత్లీ సందర్భంగా ప్రాణనష్టం తప్పిందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 20 రోజుల్లో బాధితులకు సహాయక చర్యలు అందించామనీ, 11 రోజుల్లో మౌలిక వసతులను పునరుద్ధరించామని చంద్రబాబు అన్నారు.

More Telugu News