Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • జయాపజయాల గురించి రకుల్!
  • బన్నీ సినిమాకి ముహూర్తం ఖరారు 
  • వాయిదా పడుతున్న నిఖిల్ చిత్రం

*  ఏ సినిమా జయాపజయాలకైనా కథ, దర్శకుడే కారణం.. అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. 'అవును, ముందు కథ బాగుండాలి. ఆ తర్వాత దానిని చక్కని సినిమాగా మలచగలిగే ప్రతిభావంతుడైన దర్శకుడు కావాలి. సినిమా జయాపజయాలకు ఈ రెండే కారణం అవుతాయి. అందుకే, నేను ఈ రెండింటికే ప్రాధాన్యం ఇస్తాను' అని చెప్పింది.
*  'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి' చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 11న ప్రారంభమవుతుందని సమాచారం.
*  యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'ముద్ర' చిత్రం విడుదల వాయిదా పడేలా వుంది. వాస్తవానికి నవంబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే, అదే సమయానికి మరో రెండు పెద్ద చిత్రాలు 'సర్కార్', 'థగ్స్ ఆఫ్  హిందూస్తాన్' రిలీజవుతున్నందున, 'ముద్ర'ను వాయిదా వేస్తున్నారట. 

More Telugu News