Anil Ambani: మా రుణం మొత్తాన్ని మాకు ఇప్పించండి... రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై కోర్టుకెక్కిన 24 సంస్థలు

  • 13 సంస్థలకు పరిష్కారాలేవీ చూపలేదు
  • 11 సంస్థలకు గతంలో ఆర్‌కామ్ పరిష్కారం
  • వివిధ దశల్లో కొన్ని వివాదాలు
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం నుంచి తమకు రావాల్సిన రుణాన్ని ఇప్పించాలని కోరుతూ 24 ప్రముఖ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఓ జాతీయ వార్తా సంస్థ కథనం మేరకు 24 సంస్థల్లో 13 సంస్థలకు బాకీ చెల్లింపునకు సంబంధించిన పరిష్కారాలేవీ చూపలేదు.

మిగిలిన 11 సంస్థలకు గతంలో ఆర్‌కామ్ పరిష్కారం చూపించింది కానీ ఇంతవరకూ రుణాలు చెల్లించలేదు. రుణాలకు సంబంధించిన కొన్ని వివాదాలు వివిధ దశల్లో ఉన్నాయి. కోర్టును ఆశ్రయించిన ప్రముఖ సంస్థల్లో పేటీఎం, అసెండ్‌ టెలికాం, సిస్కామ్‌ కార్పొరేషన్‌, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 24 సంస్థలున్నాయి.
Anil Ambani
Reliance
Ascend Telecam
Siscam Corporation
Benguluru Airport

More Telugu News