Nara Lokesh: 'మోదీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌'తో జగన్ నాటకాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారు: లోకేశ్

  • జగన్, మోదీలకు ప్రజలే బుద్ధి చెబుతారు
  • అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్నారు
  • టీడీపీపై నిందలు వేయాలని కలలు కంటున్నారు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడిపై జరిగిన దాడి వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై మరొకరు ధ్వజమెత్తుతున్నారు. ఉదయం నుంచి మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన జగన్, ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

జగన్, మోదీలను కలిపి 'జగన్మోదీరెడ్డి'గా సంబోధించిన లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను, అధికారులను కించపరచడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కేంద్రం నిర్వీర్యం చేసిన మోదీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో జగన్ నాటకాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం టీడీపీపై నిందలు వేయాలని జగన్ కలలు కంటున్నారని, జగన్మోదీరెడ్డిలకు ప్రజలే బుద్ధి చెప్తారని లోకేశ్ విమర్శించారు.
Nara Lokesh
Jagan
Narendra Modi
Telugudesam
YSRCP

More Telugu News