jagan: జగన్ పై దాడి... టీమిండియా క్రికెటర్లకు కష్టాలు

  • మూడో వన్డే కోసం పూణే వెళ్లడానికి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన కోహ్లీ సేన
  • అదే సమయంలో జగన్ పై దాడి
  • అంతా సద్దుమణిగిన తర్వాత ఎయిర్ పోర్టులోకి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే, విశాఖ వన్డేను ముగించుకున్న కోహ్లీ సేన మూడో వన్డే కోసం పూణె వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చింది. అదే సమయంలో జగన్ పై దాడి జరగడంతో... ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

దీంతో, క్షణాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. భద్రతా కారణాల రీత్యా ఎయిర్ పోర్టు లోనికి ఎవరినీ పంపలేదు. దీంతో, విమానాశ్రయానికి కాస్త దూరంలోనే వాహనాలు ఆగిపోయాయి. ఈ వాహనాల్లో భారత క్రికెటర్లు ఉన్న రెండు బస్సులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జగన్ హైదరాబాదుకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో ... టీమిండియా ఆటగాళ్లు మరో విమానంలో పూణేకు బయల్దేరి వెళ్లారు.

More Telugu News