రఘువీరారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రాఫెల్ కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం
- ఐటీ శాఖ కార్యాలయం వైపుగా నిరసన ప్రదర్శన
- అరెస్ట్ చేసి, భవానీపురం పీఎస్ కు తరలించిన పోలీసులు
ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇద్దరూ దోపిడిదారులు, దొంగలని విమర్శించారు. రాఫెల్ కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని, లేదా మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా పెరుగుతుంటే... విచారణ చేయకుండా.... అర్ధరాత్రి 2.00 గంటలకు సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను ఉన్నపళంగా ఆ పదవి నుంచి తప్పించి, మరొకరిని నియమించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.