శ్రీనివాసరావుపై ఐపీసీ 307 కింద కేసు నమోదు!
- ఫిర్యాదు చేసిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్
- ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- విచారణ జరుపుతున్నామన్న పోలీసులు
నిందితుడిని ఘటన వెంటనే అదుపులోకి తీసుకున్నామని ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత, శ్రీనివాసరావుపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 (హత్యాయత్నం) ప్రకారం కేసును నమోదు చేసినట్టు పోలీస్ ఇనస్పెక్టర్ మల్లా శేషు వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు. కాగా, ఎయిర్ పోర్టులోని ఓ కెఫెటేరియాలో వెయిటర్ గా ఉన్న శ్రీనివాసరావు, నిన్న జగన్ తో మాట్లాడుతూ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.