జగన్ పై దాడి తరువాత, నాకేమైనా జరిగితే అవయవదానం చేయండి: లేఖలో శ్రీనివాసరావు
- శ్రీనివాసరావు జేబులో సుదీర్ఘ లేఖ
- ప్రభుత్వంపై విమర్శలు చేసిన దాడి నిందితుడు
- మీడియాకు లేఖను విడుదల చేసిన పోలీసులు
వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకెంతో అభిమానమని, చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని చెప్పుకొచ్చాడు. జగన్ అధికారంలోకి వస్తే, అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించాడు. ఒకసారి లబ్ధి పొందిన వారే, మళ్లీ మళ్లీ లబ్ది పొందుతున్నారని ఆరోపించాడు. పేదలకు ఏ విధమైన పథకాలూ అందడం లేదని ఆరోపించాడు. చివరిలో శ్రీనివాసరావు తన సంతకాన్ని కూడా చేయగా, సీఐఎస్ ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ సంతకాలతో లేఖను అధికారులు ధ్రువీకరించారు.