సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. హిట్లర్ పోకడలు మానాలి: బీజేపీ నేత జీవీఎల్
- జగన్ పై దాడి అమానుషం..ఏదో కుట్ర ఉంది
- నిందితుడిని ఎవరు ఏ ఆలోచనతో ప్రేరేపించారో తేలాలి
- ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
దాడి చేసిన వ్యక్తిని ఎవరు ఏ ఆలోచనతో ప్రేరేపించారో తేలాలని, తప్పుడు ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడంతో టీడీపీ నెంబర్ వన్ అని, ఎయిర్ పోర్ట్ లో దాడి చేస్తే తమపైకి రాదని టీడీపీ అనుకున్నట్టుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, హిట్లర్ పోకడలు మానాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హింస ద్వారా ప్రతిపక్షాలను బెదిరించాలని చూస్తే సహించమని జీవీఎల్ హెచ్చరించారు.