Incometax: హైదరాబాద్ లోని నవయుగ కార్యాలయంలో ఐటీ సోదాలు

  • ఆర్వోసీ నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలో దాడులు
  • 47 కంపెనీల సమాచారాన్ని సేకరిస్తున్న ఐటీ అధికారులు
  • పలు సంస్థల లావాదేవీల వివరాలపై ఆరా
 రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న సంస్థ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. నవయుగకు చెందిన 47 కంపెనీల గత నాలుగేళ్ల ఐటీ రిటర్న్స్, ప్రాజెక్టుల నిర్వహణ వ్యవహారాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే, కృష్ణా డ్రైడ్జింగ్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ సంస్థల లావాదేవీల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
Incometax
Navayuga

More Telugu News