jagan: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్.. అప్పటికే అక్కడకు చేరుకున్న భారతి

  • విశాఖ నుంచి శంషాబాద్ చేరుకున్న జగన్
  • జగన్ కోసం సిద్ధంగా ఉన్న అంబులెన్స్
  • భారీగా చేరుకున్న వైసీపీ మద్దతుదారులు
విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్... హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అప్పటికే ఆయన భార్య వైయస్ భారతి అక్కడకు చేరుకున్నారు. ఆయన కోసం ఇప్పటికే అధికారులు అంబులెన్సును సిద్ధంగా ఉంచారు. ఓ డాక్టర్, ఓ నర్సును ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లనున్నారు. మరోవైపు, శంషాబాద్ విమానాశ్రయం వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. 
jagan
YSRCP
hyderabad
airport

More Telugu News