gvl narasimha rao: జగన్ పై దాడి అనుమానాలకు తావిస్తోంది: జీవీఎల్ నరసింహారావు

  • జగన్ పై దాడిని ఖండిస్తున్నాం
  • జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలి
  • దుండగుడిని కఠినంగా శిక్షించాలి
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కత్తితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ దాడిని అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలని చెప్పారు. ఎంతో సురక్షితమైన ఎయిర్ పోర్ట్ లో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పారు. దాడికి యత్నించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, జగన్ పై దాడి జరిగిందనే వార్తతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. 
gvl narasimha rao
jagan
attack

More Telugu News