జగన్ ను పొడిచిన కత్తికి విషం పూసి ఉంటే ఏంటి పరిస్థితి?: రోజా ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ను పొడిచిన కత్తికి విషం పూసి ఉంటే ఏంటి పరిస్థితి?: రోజా ఆందోళన

  • జగన్ పై చిన్న చాకుతో దాడి చేశారంటూ కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి
  • ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే.. చిన్న విషయంగా తీసి పారేస్తారా?
  • జగన్ కు ఏమైనా అయితే ఊరుకునేది లేదు 
విశాఖ విమానాశ్రయంలోని విజిటర్స్ లాంజ్ లో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్ కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్ పై హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పై చిన్న చాకుతో దాడి చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని... ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారా? అని మండిపడ్డారు. జగన్ కు ఏమైనా అయితే ఊరుకోబోమని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నామని చెప్పారు.
jagan
roja
attack

More Telugu News