Arvind Kejriwal: కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

  • కేజ్రీ, సిసోడియాలతో పాటు 11 మంది ఎమ్మెల్యేలకు బెయిల్
  • సీఎస్ అన్షు ప్రకాశ్ పై దాడి కేసు
  • రూ. 50 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలతో పాటు మరో 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాశ్ పై దాడి కేసులో బెయిల్ మంజూరయింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. రూ. 50 వేల పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018 ఫిబ్రవరి 19న రాత్రి వేళ చీఫ్ సెక్రటరీని తన నివాసానికి కేజ్రీ పిలుపించుకున్నారు. ఈ సందర్భంగానే తనపై దాడి చేశారంటూ సీఎస్ కేసు పెట్టారు. 
Arvind Kejriwal
sisidia
bail
patiala court

More Telugu News