mumbai: ముంబై సముద్ర తీరంలో స్పీడ్ బోటు బోల్తా.. కోస్ట్ గార్డు సిబ్బంది సహాయకచర్యలు

  • శివాజీ స్మారక పనుల పరిశీలనకు వెళ్తుండగా ప్రమాదం
  • ఓ స్పీడ్ బోటులో మహారాష్ట్ర సీఎస్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
  • మరో స్పీడ్ బోటులో నలభై మంది పాత్రికేయులు

ముంబైలోని అరేబియా సముద్ర తీరంలో స్పీడ్ బోటు బోల్తా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక పనులను పరిశీలించే నిమిత్తం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఒక  స్పీడ్ బోటులో మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ మేటే, ఎమ్మెల్యే రాజ్ పురోహిత్, అధికారులు సహా 25 మంది ఉన్నారు. మరో బోటులో సుమారు 40 మంది పాత్రికేయులు ఉన్నారు.

దినేష్ కుమార్ జైన్ ప్రయాణిస్తున్న బోట్ కు రాళ్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మునిగిపోగా, ఇద్దరిని కాపాడినట్టు నేవీ అధికారుల సమాచారం. ఘటనా స్థలిలో సహాయకచర్యలను కోస్ట్ గార్డు సిబ్బంది ప్రారంభించింది. కాగా, దినేష్ కుమార్ జైన్, వినాయక్ మేటే, రాజ్ పురోహిత్ సహా అధికారులందరూ సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News